ఎమ్మెల్యే శంకర్‌నాయక్
అక్షరశక్తి, మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ పాలనలో మహబూబాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పరంగా దూసుకపోతోందని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ సముదాయం, మున్సిపాలిటీ భవనాన్ని జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి ఆయన పరిశీలించారు. నిర్మాణ విధానాన్ని అధికారులతో కలిసి వివరంగా తెలుసుకున్నారు.
పరిసరాలు, పార్కింగ్, పచ్చదనం లాంటి అన్ని హంగులతో నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచనలు చేసారు. అంతేకాకుండా వీటి నిర్మాణం పూర్తి కాగానే సీఎం కేసీఆర్ ప్రారంభానికి వస్తారని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. మహబూబాబాద్ లాంటి వెనుకబడ్డ జిల్లాను అభివృద్ధి చేయడమే సీఎం లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, మార్నేని వెంకన్న, చిట్యాల జనార్దన్, యాళ్ల మురళీధర్ రెడ్డి, గోగుల రాజు, హరిసింగ్, ఎలేందర్ తదితరులు ఉన్నారు.