జనగామ జిల్లా నర్మెట్ట మోడల్ స్కూల్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఔట్ సోర్సింగ్ జాబ్ విషయంలో డబ్బులు వసూలు చేస్తుండగా ఏసీబీకి పట్టుబడ్డారు. స్కూల్ ప్రిన్సిపాల్ అనురాధ, లెక్చరర్ మల్లేశ్ ఇద్దరు కలిసి అటెండర్ రేణుక వద్ద రూ. 18 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు దొరికారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసిన అధికారులు ఆస్తుల వివరాలపై విచారిస్తున్నారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలంరేపింది.