Saturday, July 27, 2024

ఆర్టీసీ బ‌స్సులో రూ.ల‌క్ష‌… డ్రైవ‌ర్ ఏం చేశాడంటే..

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట రూర‌ల్ : న‌ర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవ‌ర్ త‌న నిజాయితీని చాటుకున్నారు. బ‌స్సులో ఓ ప్ర‌యాణికుడు మ‌రిచిపోయిన ల‌క్ష రూపాయ‌ల‌ను ఆర్టీసీ అధికారులకు అంద‌జేసి, తిరిగి స‌ద‌రు ప్ర‌యాణికుడికి అప్ప‌గించారు. ఈ సంద‌ర్భంగా డ్రైవ‌ర్ ఎండీ. రజాక్ ను నర్సంపేట డిపో మేనేజర్ కె. బాబునాయక్, ఉద్యోగులు శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు.
వివ‌రాలు ఇలా ఉన్నాయి. నర్సంపేట డిపోకి చెందిన డిలక్స్ TS 07Z 4031 నెంబర్ గల ఆర్టీసీ బస్సు గ‌త మంగ‌ళ‌వారం ఉదయం 5 గంటలకు నర్సంపేట నుండి హైదరాబాద్ కు బయలుదేరింది. ఉప్పల్ రింగ్ రోడ్డు కు పోయిన తర్వాత ఒక ప్రయాణికుడు సీట్లోనే లక్ష రూపాయలు మరచి దిగి వెళ్లిపోయాడు. ఇది గమనించిన బస్సు టిమ్ డ్రైవర్ ఎండీ.రజాక్( స్టాఫ్ నెంబర్ E. 653471) నిజాయితీతో భద్రపరచి నర్సంపేట డీఎంకు ఫోన్ చేసి సమాచారం అందించారు. తర్వాత ఎంజీబీఎస్ నుండి డ్రైవర్ కాల్ చేశారు. లక్ష రూపాయలు బస్సులో మరచిపోయిన ప్రయాణికుడు హనుమకొండ కొత్తూరు ప్రాంతానికి చెందిన ఎండీ.షౌఖత్ అలీగా ఆధారాలతో గుర్తించి డీఎం బాబునాయక్ ఆదేశాల మేరకు రజాక్ వరంగల్ -1 డిపో డీఎం వంగల మోహన్ రావు, అధికారులకు లక్ష రూపాయలు అందించాడు. రజాక్ ను ఎండీ సజ్జనార్, ఈడీ వెంకటేశ్వర్లు, ఆర్ఎం శ్రీదేవి అభినందించారు.
ఈ సందర్భంగా నర్సంపేట డిపో టిమ్ డ్రైవర్ ఎండీ. రజాక్ ను బుధవారం డీఎం కార్యాలయంలో శాలువా, పుష్ఫగుచ్ఛంతో డీఎం బాబునాయక్, ఉద్యోగులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సహాయ మేనేజర్ మామిడాల సరస్వతి, ఎంఎఫ్ అమల, విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ వీరారెడ్డి, డీఐ బండి బాబు, ఎన్వీ.రెడ్ది, యాకూబ్ రెడ్డి, స్వామి, శ్రీనివాస్, రమణమ్మ, మొగిళి, రవి, మల్లిఖార్జున్, కేవై.రవి, ప్రభాకర్, శివరాం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img