అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్ కమీషనరేట్ పరిధిలో ఐదుగురు ఇన్‌స్పెక్టర్లను, ముగ్గురు ఎస్సైలను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎస్ రవికుమార్‌ను సీసీఎస్ వరంగల్ నుంచి నర్సంపేట టౌన్ పీఎస్, పులి రమేష్‌ను నర్సంపేట టౌన్ నుంచి వీఆర్‌వరంగల్‌కు, పుల్యాల కిషన్‌ను సీఎస్బీ వరంగల్ నుంచి నర్సంపేట రూరల్ పీఎస్‌కు, కే సూర్యప్రసాద్‌ను నర్సంపేట రూరల్ నుంచి వీఆర్ వరంగల్‌కు, టీ రవికుమార్‌ను వీఆర్ వరంగల్ నుంచి సీపీటీసీ వరంగల్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అదేవిధంగా, బొంగు మాధవ్‌ను మిల్సకాలనీ పీఎస్ నుంచి ఖానాపూర్ ఎస్‌హెచ్‌వోగా, పిట్టల తిరుపతిని ఎస్‌హెచ్‌వో ఖానాపూర్ నుంచి మిల్స్‌కాలనీ పీఎస్‌కు, శీలం రవియాదవ్‌ను మహబూబాబాద్ టౌన్ పీఎస్ నుంచి నర్సంపేట టౌన్ పీఎస్‌కు బదిలీ చేశారు.
Must Read