- సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు
అక్షరశక్తి, హనుమకొండ: భవిష్యత్‌లోనూ టీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తాం… కానీ అది టీఆర్ఎస్ చేతిలోనే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హన్మకొండలోపి పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై టీఆర్ఎస్ ఇలాగే పోరాటం చేస్తేనే తమమద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారపిపాసిలా తయారయ్యారని విమర్శించారు. దేశంలో అరాచకం కొనసాగుతోందని, నియంతలా మోడీ పాలిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కూడా ఇలాలేదని తెలిపారు. ప్రతిపక్ష ముక్త్ భారతే మోదీ విధానమని మండిపడ్డారు. ఎనిమిది రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చివేశారని… తెలంగాణలో విఫలయత్నం చేశారన్నారు. ఈడీ, ఐటీ, ఎలక్షన్ కమిషన్, జుడీషీయరీ ఉపయోగించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
విపక్ష నేతలను లొంగతీసుకునేందుకే ఈడీ దాడులని కూనంనేని ఆరోపించారు. పోసాని మురళీకృష్ణకు నకలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అని… చట్టాలు తెలియని అజ్ఞాని బండి సంజయ్ అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల ఎరకేసులో అమిత్ షాను రప్పిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు. అమిత్ షాకు సిట్ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాస్ రావు హత్యను ఖండిస్తున్నామన్నారు. పోడు భూముల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
Must Read