ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించిన ఎస్సై ఎగ్జామ్‌కు సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ పరీక్షలకు సంబంధించిన ఆబ్జెక్టివ్ పార్ట్ కు సంబంధించిన ప్రైమరీ కీని ప్రస్తుతం బోర్డు విడుదల చేసింది. ఈ కీపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్ సైట్లో తమ వ్యక్తి గత లాగిన్ ద్వారా సమర్పించాలని బోర్డు సూచించింది.