అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్ పోలీస్‌కమిషరేట్ పరిధిలో మరో ఎస్సై సస్పెన్షకు గురయ్యారు. వ్యవసాయ భూవివాదంలో నిందితుడికి సహకరించినందుకుగాను గతంలో రఘునాథపల్లి ఎస్సైగా పనిచేసిన ఎన్ వీరేందర్ కమిషనరేట్ వీఆర్‌కు బదిలీ చేశారు. ఈ వ్యవసాయ భూ వివాదానికి సంబంధించి అధికారులు నిర్వహించిన విచారణకు ఎస్సై సహకరించకపోవడంతోపాటు ఈ వివాదంలో ఎస్సై నిందితుడికి సహకరించడంతో పాటు సంబంధించిన బాధితుల్ని ఇబ్బందులు గురి చేసినందునట్లుగా విచారణలో నిర్ధారణ కావడంతో ఎస్సై వీరేందర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.