అక్షరశక్తి, గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం హట్యాతండా సమీపంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో భద్రాద్రి జిల్లా డీసీఆర్బీ లో ఎస్సైగా పనిచేస్తున్న సోమ కుమారస్వామి (56) మృతి చెందారు. మృతుడిది వరంగల్ జిల్లా గీసుగొండ మండలం అనంతారం.ఒంటరిగా కారు నడుపుతుండగా అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.