-గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నన్నపునేని
అక్షరశక్తి, వరంగల్ తూర్పు : ఎన్నికల ముంగిట వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీకి షాక్ తగిలింది. ఈ నియోజకవర్గంలోని 36వ డివిజన్ కు చెందిన బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు లక్క శివ నేడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం శివనగర్ లోని కెపిఎస్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.