అధ్యక్షపదవికి రాజీనామా చేసిన బండి సంజయ్
ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్
అక్షరశక్తి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ మంగళవారం రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీలో భారీ మార్పులంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. రెండు రోజులుగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితర జాతీయ నాయకులతో భేటీ ముగిసిన అనంతరం బండి సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం నియమించింది. అలాగే ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, ఎంపీ అయిన బండి సంజయ్‌కు కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును తొలగించి ఆయన స్థానంలో మాజీ మంత్రి పురంధేశ్వరిని నియమించింది.
Must Read