తమ్ముడిపై అన్న హత్యాయత్నం..
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : ఆస్తి తగాదాల్లో తమ్ముడిపై అన్న హత్యాయత్నానికి పాల్పడిన ఘటన హన్మకొండ కాపువాడలో చోటు చేసుకుంది. ఈ మేరకు హన్మకొండ ఇన్‌స్పెక్టర్ కర్ణాకర్ కేసు వివరాలు వెల్లడించారు. కాపువాడకు చెందిన నాగపురి నిఖిలేష్‌కు, నాగపురి రాకేష్‌కు కొంతకాలంగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జూలై 2వ తేదీన సాయంత్రం తమ్ముడు నిఖిలేష్‌తో తన అన్న రాకేష్ గొడవ పడ్డాడు. అన్న రాకేష్ జేబులో తెచ్చుకున్న కత్తితో దాడి చేస్తుండగా ఇంతలోనే నిఖిలేష్ భార్య కవిత అడ్డుకోబోగా ఆమెను కూడా కత్తితో బెదిరించి దాడి చేశాడు. దీంతో ఆమె చేతివేళ్లు తెగాయి. నిఖిలేశ్ కు కడుపులో, తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే రాకేష్ అక్కడి నుండి పోయాడు. నిఖిలేష్ భార్య నాగపురి కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు నాగపురి రాకేష్‌ను త్వరలోనే అరెస్టు చేసి రిమాండ్ కు పంపిస్తామని ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు.
Must Read