ఈనెల 8న ప్రధాని మోడీ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మోడీ 8న ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరి 9:45 గంటలకి హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయానికి చే రుకుంటారు. 9:50 గంటలకు హెలికాప్టర్‌లో వరంగల్‌కు బయల్దేరతారు. 10.35కి హన్మకొండలోని హె లిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. 11.30 నుంచి మధ్యాహ్నం 12.10 వరకు ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 12.15కి వరంగల్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 1.10 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజస్థాన్ పర్యటనకు ప్రధాని వెళ్లనున్నారు.