Saturday, July 27, 2024

బిగ్‌బ్రేకింగ్‌… న‌వంబ‌ర్ 30న తెలంగాణ ఎన్నిక‌లు

Must Read

డిసెంబ‌ర్ 3న ఓట్ల లెక్కింపు.. నేటి నుంచి రాష్ట్రంలో అమ‌ల్లోకి ఎన్నిక‌ల కోడ్‌

రాష్ట్ర శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వి డుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో న‌వంబ‌ర్ 3ంన ఒకే ద‌ఫాలో పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా.. డిసెంబ‌ర్ 3న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. న‌వంబ‌ర్ 3న ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. అదేవిధంగా నామినేష‌న్ల స‌మ‌ర్ప‌ణ‌కు న‌వంబ‌ర్ 10 చివ‌రి తేదీ కాగా 13వ‌ర‌కు ప‌రిశీలించ‌నున్నారు. న‌వంబ‌ర్ 15న ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. ఈమేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్ సోమవారం న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరంల‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగ‌నున్నాయి. తెలంగాణ‌లో న‌వంబ‌ర్ 30న‌, రాజస్థాన్‌లో న‌వంబ‌ర్ 23న‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో న‌వంబ‌ర్ 17న‌, మిజోరాంలో న‌వంబ‌ర్ 7న ఒకే విడ‌త‌లో పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మాత్రం న‌వంబ‌ర్ 7న తొలివిడ‌త‌, న‌వంబ‌ర్ 17న రెండో విడ‌త‌లో ఓటింగ్ నిర్వ‌హించ‌నున్నారు.
నేటి నుంచి అమ‌ల్లోకి ఎన్నిక‌ల కోడ్‌..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌వ‌డంతో నేటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అ మల్లోకి వచ్చేసింది. ప్రభుత్వం ఇక కొత్తగా ఏ పథకాలూ ప్రకటించే అవకాశం ఉండదు. అలాగే కొత్తగా శంకుస్థాపనలూ, ప్రారంభోత్సవాలూ ఉండ‌వు. పార్టీల కార్యక్రమాలు, నేతల అధికార ప్రచారాల విషయంలో షరతులు తప్పవు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాల‌కు గాను బీఆర్ఎస్ పార్టీ ముందుగానే 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. నెల నుంచి ఆపార్టీ అభ్యర్థులు జిల్లాల్లోకి వెళ్లిపోయి.. ఎన్నికల ప్రచారం చే ప‌డుతున్నారు. నోటిఫికేష‌న్ విడుద‌లైన నేప‌థ్యంలో మ‌రికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్, బీజేపీలు తమ పార్టీ నుంచి పోటీచేసే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించనున్నాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img