Monday, September 9, 2024

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Must Read

జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగ‌ళ‌వారం తెల్లవారుజామున ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. డీసీఎం డ్రైవర్, క్లీనర్ సహా కారులోని చిన్నారి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డీసీఎం పంక్చర్ కావడంతో టైర్ మారుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img