Tuesday, June 25, 2024

భూక‌బ్జా కేసులో కుడా మాజీ డైరెక్ట‌ర్ అరెస్టు ?

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో క‌బ్జారాయుల గుండెళ్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. ఇటీవ‌ల ఇద్ద‌రు కార్పొరేట‌ర్లు అరెస్టు అయిన విష‌యం తెలిసిందే. తాజాగా, భూ ఆక్ర‌మ‌ణ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కుడా (కాక‌తీయ అర్బ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ) మాజీ డైరెక్ట‌ర్ ర‌మేష్‌యాద‌వ్ పై కేసు న‌మోదు అయింది. 386, 447, 427 సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసి అరెస్టు చేసి విచారిస్తున్న‌ట్లు తెలిసింది. ఈ ఘ‌ట‌న‌తో మ‌రోసారి గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప‌రిధిలో క‌ల‌క‌లం రేగుతోంది. ముచ్చ‌ర్ల నాగారం స‌మీపంలో సుమారు 10 గుంట‌ల భూమిని క‌బ్జా ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ర‌మేష్‌యాద‌వ్‌పై కేసు న‌మోదు అయిన‌ట్లు స‌మాచారం. అంతేగాకుండా, ఈ కేసుకు సంబంధించి మ‌రో ముగ్గురు కూడా పోలీసుల‌ అదుపులో ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయవ‌ర్గాల స‌మాచారం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img