అక్షరశక్తి, వరంగల్ : 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌పై నమోదైన కేసును మంగళవారం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఎన్నికల సమయంలో కరపత్రాలకు బిల్స్ లేవనే ఆరోపణతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తోపాటు ఆయన పీఏ, వాహనదారుడిపై ఎన్నికల అధికారి కాజీపేటలో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఇవాళ హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఎమ్మెల్యేపై కేసును కోర్టు కొట్టివేయడంతో ఆయనకు ఊరట లభించినట్లయింది.