Monday, September 9, 2024

న‌రేంద‌ర్‌కు జై

Must Read
  • వ‌రంగ‌ల్ తూర్పులో ఎమ్మెల్యే న‌న్న‌పునేనికి మద్దతుగా పద్మశాలీల ఏకగ్రీవ తీర్మానం
  • 2005లో భక్త మార్కండేయ పరపతి సంఘం ఆవిర్భావం
  • మొదటిసారి ఎమ్మెల్యేకు పూర్తి మద్దతు..
  • రుణ‌ప‌డి ఉంటాన‌న్న ఎమ్మెల్యే నన్నపునేని
    అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు కుల సంఘాల మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఇప్ప‌టికే ప‌లు సంఘాలు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌గా, తాజాగా భక్త మార్కండేయ పరపతి సంఘం జైకొట్టింది. 2005లో ఆవిర్భ‌వించిన భక్త మార్కండేయ పరపతి సంఘం ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి, అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేదు. తూర్పులో ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ చేప‌డుతున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆక‌ర్షితులై గులాబీ పార్టీకి మద్దతుగా పద్మశాలీలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈమేర‌కు గురువారం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, నియోజకవర్గ బీఆర్ఎస్ ఎ మ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్‌ను క‌లిసి ఏకగ్రీవ తీర్మానం ఆమోదపత్రాన్ని అందించారు. ఖిలా వరంగల్ పడమరకోటలో స్థాపించిన శ్రీ భక్త మార్కండేయ పరపతి సంఘం తీసుకున్న సంచలన నిర్ణయం అధికార బీఆర్ఎస్‌కు బ‌లాన్నిచ్చింది. ఈసంద‌ర్భంగా ప‌ర‌ప‌తి సంఘం నాయ‌కులు మాట్లాడుతూ… 2005 నుండి నేటి వరకు ఏ ఒక్క ఎమ్మెల్యేకు తాము పూర్తి మద్దతు తెలుపలేద‌న్నారు. కానీ సంఘం అభివృద్ధికి సహకరించ‌డ‌మేగాక సుమారు రూ. 33 లక్షల నిధులను కేటాయించి ఎల్లవేళలా అం దుబాటులో ఉండి అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కుశ్రీభక్త మార్కండేయ పరపతి సంఘం పూర్తి మద్దతు తెలుపుతుంద‌న్నారు. ఈమేర‌కు ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదపత్రాన్ని ఖిలా వరంగల్ పద్మశాలి భవన్ లో ఎమ్మెల్యే నరేందర్‌కు అందజేశామ‌ని తెలిపారు. అనంత‌రం ఎమ్మెల్యే న‌రేంద‌ర్ మాట్లాడుతూ… 2005లో స్థాపించిన శ్రీ భక్త మార్కండేయ పరపతి సంఘం త‌న‌కు పూర్తి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదపత్రాన్ని అందించ‌డం పూర్వజన్మ సుకృతం అన్నారు. ఎల్లవేళలా రుణపడి ఉంటాన‌ని, పద్మశాలీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, శ్రీ భక్త మార్కండేయ పరపతి సంఘం అధ్యక్షులు, కార్యవర్గం, మహిళలు పద్మశాలి పెద్దలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img