Tuesday, June 18, 2024

ప్రజల ఆశీర్వాదంతో మరోమారు భారీ మెజారిటీతో గెలుస్తా..

Must Read

వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. నామినేష‌న్ దాఖలు
అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు: వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్నపునేని నరేందర్ బుధ‌వారం నామినేషన్ దాఖలు చేశారు. ఈసందర్భంగా మండ‌లి డిప్యూటీ చైర్మన్, వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జ్ బండ ప్రకాష్‌తో కలిసి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని నామినేషన్ కేంద్రంలో నన్నపునేని నరేందర్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈసందర్భంగా మున్సిపల్ ఆవరణంలో ఉన్న మీడియా పాయింట్ లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఆశీస్సులతో వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేయాలని బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశామ‌న్నారు. ప్రజల ఆశీర్వాదంతో మరోమారు భారీ మెజారిటీతో గెలుస్తాన‌న్న ధీమా వ్య‌క్తం చేశా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమంలో ముందుంద‌న్నారు.నియోజకవర్గ అభివృద్ధి మొదటి ఎజెండగా, వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు కుటుంబ సభ్యులుగా ముందుకు సాగుతున్నాన‌న్నారు. గ‌త ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపించిన వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజలకు పాదాభివందనం.. రాబోయే ఎన్నికల్లో ప్రజలు గొప్పగా ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మా నాయకులు, ప్రజలతో కలిసి 10వ తేదీన మరోమారు నామినేషన్ వేస్తానన్నారు. నామినేషన్ సందర్భంగా శాసన మండలి డిప్యూటీ చైర్మ‌న్ బండా ప్రకాష్‌తో కలిసి న‌రేంద‌ర్ బట్టలబజార్ లోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img