Monday, September 9, 2024

అట్ట‌హాసంగా స‌త్తెన్న నామినేష‌న్‌

Must Read

 

అక్ష‌ర‌శ‌క్తి, భూపాలపల్లి : భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గండ్ర సత్యనారాయణరావు బుధ‌వారం మధ్యాహ్నం 2:36 గంటలకు నామినేషన్ దాఖ‌లుచేశారు. భూపాలపల్లి రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో) రమాదేవికి నామినేష‌న్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో జీఎస్ఆర్ వెంట డీసీసీ ప్రెసిడెంట్ అయిత ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కటంగూరి రాంనర్సింహారెడ్డి, గాజర్ల అశోక్ ఉన్నారు. నామినేషన్ సంద‌ర్భంగా వేలాదిగా కాంగ్రెస్ శ్రేణులు, స‌త్తెన్న అభిమానులు త‌ర‌లిరావ‌డంతో భూపాల‌ప‌ల్లి జిల్లా కేంద్రం జ‌నసంద్రంగా మారింది.
జోరుగా నామినేష‌న్లు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీచేసే అభ్య‌ర్థుల నామినేషన్ల స్వీక‌ర‌ణ గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో బుధ‌వారం ఉమ్మ‌డి వ‌రంగల్ జిల్లాలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతోపాటు ప‌లువురు నామినేష‌న్లు దాఖ‌లుచేశారు. వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌, న‌ర్సంపేట నుంచి ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి, డోర్న‌క‌ల్ నుంచి ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయ‌క్‌, హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యే ఒడితల స‌తీష్‌కుమార్ నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. అదేవిధంగా.. కాంగ్రెస్ నుంచి హుస్నాబాద్ అభ్య‌ర్థిగా మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్, ములుగు నుంచి ఎమ్మెల్యే సీత‌క్క‌, డోర్న‌క‌ల్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా జాటోత్ రాంచంద్రునాయ‌క్ నామినేష‌న్లు దాఖ‌లుచేశారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img