Saturday, July 27, 2024

కామారెడ్డి రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి.. బాధిత కుటుంబాలకు ప్రధాని పరిహారం

Must Read

కామారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. టాటా ఎస్‌ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో మొత్తం తొమ్మిది మంది చనిపోయిన సంగ‌తి తెలిసిందే. కాగా, ప్ర‌ధాని మోడీ .. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి రూ. 50 వేల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. అలాగే బాధిత కుటుంబాలకు తన సంతాపం తెలియజేశారు.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అన్నాసాగర్ తండా వ‌ద్ద ఆదివారం సాయంత్రం వడ్ల బస్తాల లోడుతో వెళ్తున్నలారీ, ఎల్లారెడ్డి నుంచి పిట్లం వైపు వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని వేగంగా వచ్చి ఢీకొట్టింది. పిట్లం మండలం చిల్లర్గి గ్రామస్ధులు మహీంద్ర ట్రాలిలో ఎల్లారెడ్డి వెళ్లారు. అక్కడ చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించి తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. మొత్తం 26మందిలో ఐదుగురు చనిపోగా..10 మందికిపైగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వాళ్లలో మరికొంత మందిని ఎల్లారెడ్డి ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో తీవ్రంగా గాయపడి ప్రాణపాయస్థితిలో ఉన్న వాళ్లను మెరుగైన వైద్యం అందించేందుకు నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img