Saturday, July 27, 2024

నకిలీ వంటనూనె విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : నకిలీ వంటనూనె విక్రయిస్తున్న ముఠాకు చెందిన నలుగురు నిందితులను టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు ఫోర్ వీలర్ (టాటాఏస్‌), ద్విచక్రవాహనం, నకిలీ వంటనూనె డబ్బ, బియ్యం బస్తా, 24 ఖాళీ బియ్యం బస్తాలు, బియ్యం బస్తాలు కుట్టే మిషన్, త్రాసు, 4 సెల్ ఫోన్లు, 10 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లాకు చెందిన పెట్ల దావీదు, పునాదిపహాడ్, కంకిపహాడ్ మండలం, ఎరుగుల మహేష్, కోడూరు మండలం, నిడమర్తి విజయ్, కొలవిన్ను, కంకిపాడు మండలం, తటుకురి రవి, కొలవిన్ను, కంకిపాడు మండలం చెందిన నిందుతులు ఉన్నారు.
ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ వివరాలను వెల్ల‌డించారు. ఈ ముఠాలో సభ్యులు సులువుగా డబ్బు సంపాదించుకోవాలని నలుగురు ముఠాగా ఏర్పడి సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని విజయవాడ నుండి టాటాఏస్లో బయలుదేరి మార్గమధ్యంలో దొడ్డు బియ్యం కొని, వాటిని వారి వద్ద కల బియ్యం బస్తాలలో, మిషన్ ద్వార కుట్టి ఇవి సన్న బియ్యం అని నమ్మబలికి తక్కువ ధరకు అమ్ముతామని చెప్పి, మొదట నిజమైన సన్న బియ్యం చూపించి, తరువాత వారి వద్ద కల దొడ్డు బియ్యం బస్తాలను తెలియకుండా ఇచ్చేవారు. ఇదేవిదంగా వీరు స్క్రాప్ షాప్స్ వద్దకు వెళ్లి కొత్తగా ఉండే వంటనూనె డబ్బాలు కొనుగోలు చేసి అందులో 12 లీటర్లు వరకు నీటితో నింపి, అందులో 3 ప్యాకెట్స్ నూనెతో నింపేవారు. అట్టి వాటిని మా వద్ద ఒకటే డబ్బ మిగిలిఉంది, తక్కువ ధరకు ఇస్తాము అని నమ్మబలికి అమ్ముతుంటారు. ఇదే విధంగా మిల్స్ కాలనీ ఏరియాలో అమ్మగా, కేసు నమోదు అయినది. ఈ రోజు టాస్క్ ఫోర్స్ మిల్స్ కాలనీ పోలీసులు నిఘాపెట్టి అట్టి ముఠాకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ ముఠా సభ్యులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఏసీపీ డాక్ట‌ర్‌. ఏం. జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్, వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్స్ ఎస్సైలు నిసార్ పాషా, లవణ్ కుమార్ ఏ ఏ ఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్ అశోక్, మాధవ రెడ్డి, స్వర్ణలత కానిస్టేబుళ్లు శ్యాం, సురేష్, నాగరాజు, నవీన్, రాజేష్, భిక్షపతి లను అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ అభినందించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img