- మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టనున్న కాంగ్రెస్ అగ్రనేత
- ఆయనపై అనర్హతను ఎత్తివేసినట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు. ఆయనపై అనర్హతను ఎత్తివేసినట్లు లోక్‌సభ సచివాలయం సోమవారం వెల్లడించింది. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్‌కు సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్షపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే లోక్‌సభ సభ్యత్వాన్ని స్వీకర్ పునరుద్దరించారు. సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో ఇవాళ పార్లమెంట్ సమావేశాలకు రాహుల్‌గాంధీ హాజరుకానున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం అనంతరం ఆయన తొలిసారి సభలో అడుగుపెట్టనున్నారు. రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధ రించడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.