Monday, September 16, 2024

Admin

పంజాబ్‌లో కేజ్రీవాల్ ప్ర‌చారం

పంజాబ్‌: పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లు పెట్టారు. మొహాలి జిల్లా ఖారార్ నియోజ‌క‌వ‌ర్గంలో బుధ‌వారం ఇంటింటి ప్ర‌చారం చేశారు. ఈ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాల‌ని ఓట‌ర్ల‌ను అభ్య‌ర్థించారు.

క్ష‌మించండి: బ్రిట‌న్ ప్ర‌ధాని

లాక్‌డౌన్ స‌మ‌యంలో పార్టీల‌కు హాజ‌ర‌వ్వ‌డంపై బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌పై తీవ్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డుతున్నాయి. ప్ర‌తిప‌క్షాల నుంచేగాకుండా సొంత‌ప‌క్షం నుంచి కూడా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఒకానొక ద‌శ‌లో ప‌ద‌వి కూడా ఊడిపోవ‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని బోరిస్ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పారు. కొవిడ్ నిబంధ‌నల‌ను అతిక్ర‌మించ‌డంపై...

అమెరికాలో క‌రోనా కేసుల సంఖ్య ఇదే..

అమెరికాలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. ప్ర‌తీరోజు ల‌క్ష‌ల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. తాజాగా 8.94ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 6.45 కోట్ల పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 8.47ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 32కోట్ల కేసులు న‌మోదు అయ్యాయి. 55.2ల‌క్ష‌ల...

బ్రెజిల్‌లో క‌రోనా విజృంభ‌న‌

క‌రోనా మ‌హ‌మ్మారి రెచ్చిపోతోంది. బ్రెజిల్‌లో రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గ‌త 24గంట‌ల్లో 112,286 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. 251 మంది కొవిడ్‌తో మ‌ర‌ణించిన‌ట్లు ఆరోగ్య‌మంత్రిత్వ‌శాఖ తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌ 22,927,203కు చేరుకోగా 620,796 మంది క‌రోనాతో మృతి చెందిన‌ట్లు అధికారిక లెక్క‌లు చెబుతున్నాయి.

కొవిడ్‌కు మ‌రో రెండు ఔష‌ధాలు

క‌రోనా వైర‌స్ బాధితుల‌కు చికిత్స అందించ‌డానికి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మ‌రో రెండు ఔష‌ధాల‌కు ఆమోదం తెలిపింది. రూమటైడ్‌ కీళ్ల నొప్పుల నివారణకు ఎలి లిల్లీ కంపెనీ తయారు చేసిన మెడిసిన్, గ్లాక్సోస్మిత్‌క్లేన్‌ కంపెనీ మోనో క్లోనల్‌ యాంటీబాడీ థెరపీలను క‌రోనా రోగులకు ఇవ్వడానికి డబ్ల్యూహెచ్‌వో అంగీక‌రించింది. లిల్లీ కంపెనీకి చెందిన బారిక్టినిబ్‌ ఔషధం...

ఇస్రో చైర్మ‌న్‌గా సోమ‌నాథ్‌

ఇండియ‌న్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్ (ఇస్రో ) చీఫ్‌గా సీనియ‌ర్ సైంటిస్టు ఎస్ సోమ‌నాథ్‌ను కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం నియ‌మించింది. విక్ర‌మ్ సారాభాయ్ అంత‌రిక్ష కేంద్రం డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్న సోమ‌నాథ్ ఎరోస్పేస్ ఇంజినీర్‌గా మంచి గుర్తింపు పొందారు. అంతేగాదు.. జీఎస్ఎల్‌వీ ఎంకే -111 లాంచ‌ర్ అభివృద్ధిలో కీల‌కంగా వ్య‌వ‌హించారు. అయితే.. ప్ర‌స్తుతం ఇస్రో...

న‌కిలీ వ‌స్తువుల త‌యారీ ముఠా అరెస్టు

ప‌లు ఉత్ప‌త్తుల ముగ్గురు నిందితుల అరెస్టు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వివిధ కంపెనీల‌కు సంబంధించిన వ‌స్తువుల పేర్ల‌తో న‌కిలీ వ‌స్తువులు త‌యారీ చేసి గ్రామీణ ప్రాంతాల్లో విక్ర‌యిస్తున్న‌ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధ‌వారం అరెస్టు చేశారు. అడిష‌న‌ల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్, సీహెచ్ శ్రీనివాస్, ఎస్ఐ ఎస్.ప్రేమానందం వివ‌రాల‌ను వెల్ల‌డించారు. నకిలీ...

జైలుకు వెళ్లినా బుద్ధి మార‌లేదు..

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న దొంగను సిసిఎస్, కేయూసి పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసారు. నిందితుడి నుండి పోలీసులు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్ట‌ర్ . తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. హైదరాబాద్, జ‌గ‌ద్గిరిగుట్ట‌ ప్రాంతానికి చెందిన గందేశీ శివకుమార్ హైదరాబాద్‌లో మెకానిక్...

మేడారంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ములుగు జిల్లా తాడ్వాయి మండ‌లంలో మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన ఒక గుర్తుతెలియని వ్యక్తి జంపన్నవాగు సమీపంలో ఫిట్స్ వచ్చి మృతి చెందాడు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు నీలం రంగు గీతల చొక్కా, బూడిద రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడికి సుమారు 60 ఏళ్ల...

3 కిలోల బ్రౌన్ షుగ‌ర్ ప‌ట్టివేత‌

ఒడిశా: ఒడిశాలోని న‌యాగ‌ర్ జిల్లాలో స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఒక వ్య‌క్తిని అరెస్టు చేసి, అత‌డి నుంచి 3.1కిలోల బ్రౌన్ షుగ‌ర్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అలాగే.. ఆ నిందితుడి నుంచి రూ.65.32ల‌క్ష‌లు, 3 పిస్ట‌ళ్లు స్వాధీనం చేసుకున్నారు.

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...
- Advertisement -spot_img