కరోనా మహమ్మారి రెచ్చిపోతోంది. బ్రెజిల్‌లో రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గత 24గంటల్లో 112,286 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 251 మంది కొవిడ్‌తో మరణించినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 22,927,203కు చేరుకోగా 620,796 మంది కరోనాతో మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.