Friday, July 26, 2024

జై స‌త్తెన్న‌..

Must Read
  • భూపాల‌ప‌ల్లి కాంగ్రెస్‌లోకి చేరికల ప్రవాహం
  • గణపురం మండల కేంద్రంలో గులాబీ దళం డీలా
  • హస్తం పార్టీలో ఫుల్ జోష్
  • అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాల‌ప‌ల్లిలో అధికార బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస‌గా ఊహించ‌ని ఎదురుదెబ్బ‌లు తగులుతున్నాయి. ప్రతి రోజు వంద‌ల సంఖ్య‌లో ఆపార్టీకి రాజీనామాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరు తున్నారు. అన్ని మండ‌లాల నుంచి ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కాంగ్రెస్ గూటికి చేరేందుకు క్యూ క‌డుతున్నారు. దీంతో భూపాల‌ప‌ల్లి నియోజ‌వర్గంలో గులాబీ దళం పూర్తిగా డీలా పడిపో తుండగా, కాంగ్రెస్‌లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. తాజాగా గ‌ణ‌పురం మండల పరిధిలోని బసవరాజుపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయ‌కులు ఆపార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లోచేరారు. గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మార్త శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ నామాల రమేష్, యూత్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డితోపాటు జంగిలి నరసింగం, బూర లక్ష్మయ్య, నామాల రాజక్క, వార్డు నెంబర్ ధరావత్ రాజు, పుల్లూరి శ్రీనివాసరావు, లక్ష్మణరావు, రామారావు, చలపతిరావు, అంబటి సురేష్, బూర వీరయ్య, దామరపల్లి తిరుపతిరావు హ‌స్తం గూటికి చేరారు. ఈ సంద‌ర్భంగా జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీ పీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు పార్టీలో చేరిన వారంద‌రికీ కండువా క‌ప్పి ఆహ్వానించారు. ఎన్నికల్లో గండ్ర సత్తన్న గెలుపు ఖాయమని, భారీ మెజార్టీ కోసం తమవంతు కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆరు గ్యారెంటీ పథ‌కాలు అమోఘమని, సుపరిపాలన కాంగ్రెస్‌తోనే సాధ్యమని తెలిపారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img