- గులాబీ పార్టీకి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్ గుడ్‌బై
- మరికాసేపట్లో రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
- అదేబాటలో మరికొందరు కీలక నేతలు..
- నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
అక్షరశక్తి, హన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు ఊహించిన షాక్ తగిలింది. ఆపార్టీ సీనియర్ నాయకుడు, హన్మకొండ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్ బీఆర్ఎస్‌కు రాజీనామా చే సేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరికాసేపట్లోనే ఆజీన్‌ఖాన్‌తోపాటు పలువురు నాయకులు ముఖ్య నాయకులు హైదరాబాద్‌లో పీసీసీ ఛీఫ్ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అంతేగాక.. వరంగల్ పశ్చిమ నియోజ కవర్గానికి చెందిన గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేసిన పలు వురు కీలక నేతలు కూడా బీఆర్ఎస్‌ను వీడి హస్తం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
మారుతున్న సమీకరణాలు..
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌కు అత్యంత సన్నిహితులు, హన్మకొండ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్, మాజీ కార్పొరేటర్ అజీజ్ ఖాన్ తోపాటు మరో సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్, ముస్లిం మైనార్టీ నేత అబూబక్కర్, కాజీపేట మాజీ కార్పొరేటర్ సుంచు అశోక్, ముస్లిం, మైనార్టీ సీనియర్ నేతలతోపాటు రామప్ప పోలీస్ అకాడమీ చైర్మన్ ఐలు చంద్రమోహన్ గౌడ్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో రాత్రికి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. తీరా ఎన్నికల ముంగిట బీఆర్ఎస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు తలనొప్పిగా మారనున్నాయి.