పశ్చిమబెంగాల్: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎంసీకి చెందిన సుమారు 30మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని, ఇంకా ఎక్కువ కాలం టీఎంసీ ప్రభుత్వం ఉండదని వారికి తెలుసునని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.