అక్షరశక్తి, భీమదేవరపల్లి: హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ బస్ కింద పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం భీమదేవరపల్లి మండలం చంటయపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది.
స్థానికుల కథనం ప్రకారం.. చంటయపల్లికి చెందిన శరత్ – మమత దంపతుల రెండో కుమారుడు శివాన్ష్ తన అన్నయ్య సాన్విక్ గట్లనర్సింగపూర్ ప్రభుత్వ స్కూల్ బస్సు ఎక్కుతుండగా వెంట వచ్చాడు. ఈ క్రమంలో శివాన్ష్ బస్సు ముందు ఉండగా డ్రైవర్ చూసుకోకుండా బస్సు ను ముందుకు పోనిచ్చాడు. దీంతో శివాన్ష్ ముందు టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ముల్కనూర్ ఎస్సై సాయిబాబు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.