Friday, September 20, 2024

వార్త‌లు

ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ల‌పై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిష‌న్‌

ఢిల్లీ : ఆర్థికంగా వెనుక‌బ‌డిన అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు 10శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన కాంగ్రెస్ నాయ‌కుడు బుధ‌వారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. 103 రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా ఐదుగురు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో ప‌దిశాతం ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్లకు...

న‌న్ను ముక్క‌లుముక్క‌లుగా న‌రికేస్తాడు

2020లోనే పోలీసుల‌కు శ్ర‌ద్ధ ఫిర్యాదు ఢిల్లీ : శ్రద్ధా మర్డర్‌ కేసులో కీల‌క విష‌యం వెలుగుచూసింది. అఫ్తాబ్ త‌న‌ను చంపి ముక్క‌లుముక్క‌లుగా న‌రికిపారేస్తాడంటూ.. 2020 న‌వంబ‌ర్ 23న శ్ర‌ద్ధ పోలీసులకు ఫిర్యాదు చేసిన విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. త‌న‌ను తీవ్రంగా కొడుతున్నాడ‌ని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అయితే.. శ్ర‌ద్ధ‌ ఆనాడు ఫిర్యాదు చేసినా పోలీసులు...

బీజేపీకి ట‌చ్‌లో 30మంది ఎమ్మెల్యేలు

ప‌శ్చిమ‌బెంగాల్‌: ప‌శ్చిమ బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టీఎంసీకి చెందిన సుమారు 30మంది ఎమ్మెల్యేలు బీజేపీతో ట‌చ్‌లో ఉన్నార‌ని, ఇంకా ఎక్కువ కాలం టీఎంసీ ప్ర‌భుత్వం ఉండ‌ద‌ని వారికి తెలుసున‌ని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి.

రైతు స‌మ‌స్య‌ల‌పై కాంగ్రెస్ పోరుబాట‌

నవంబ‌ర్ 24 త‌హ‌సీల్దార్ కార్యాల‌యాలు 30న నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో... డిసెంబ‌ర్ 5న జిల్లా క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద ఆందోళ‌న‌లు ప్ర‌క‌టించిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి                                         ...

ఇండోనేషియాలో భారీ భూకంపం..

20 మంది మృత్యువాత 300 మందికి గాయాలు జకారా : ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రతతో జావా ద్వీపంలో సోమవారం భూమి కంపించింది. భారీ ప్రకంపనల ధాటికి భవనాలు నేలకూలగా.. 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 300 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. జావా ద్వీప పట్టణం సియాంజూర్‌ సమీపంలో భూకంప...

భర్తకు మ‌రో పెళ్లి చేసిన భార్య

మారుతున్న కాలంలో విచిత్రమైన ప్రేమలు, పెండిండ్లు సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా జ రగడం సర్వసాధారణమైంది. తిరుపతి జిల్లా డక్కిలి మండలం అంబేద్క‌ర్ నగర్‌కు చెందిన జంగిటి కళ్యాణ్ కుమార్‌కు మూడేళ్ల కింద టిక్‌టాక్ ద్వారా విశాఖపట్నంకు చెందిన నిత్యశ్రీ ప‌రిచ‌యం అయింది. పరిచయం కాస్తా ప్రేమ‌గా మారింది. ఈ ప్రేమకథ మధ్యలో...

భ‌విత‌శ్రీ బాగోతం!

ఖాతాదారుల‌కు చుక్క‌లు చూపిస్తున్న చిట్‌ఫండ్ కంపెనీ చిట్టీ ముగిసినా అంద‌ని డ‌బ్బులు నెల‌లు, ఏళ్ల‌కొద్దీ కార్యాల‌యం చుట్టూ తిరుగుతున్న వైనం హ‌న్మ‌కొండ‌లో సెంట్ర‌ల్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించిన ఖాతాదారులు ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు ఆందోళ‌న‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : ఖాతాదారుల జీవితాల‌తో చిట్‌ఫండ్ కంపెనీలు చెల‌గాట‌మాడుతున్నాయి. రూపాయి రూపాయి కూడ‌బెట్టిన సొమ్మును...

వ‌న్‌కి రోడ్డే పార్కింగ్‌

షాపింగ్ మాల్‌పై ప్రేమ చూపించిన అధికారులు పార్కింగ్ స్థ‌లం లేక‌పోవ‌డంతో రోడ్డును క‌మ్మేసిన వాహ‌నాలు పోలీస్ హెడ‌క్వార్ట‌ర్స్‌కు కూత‌వేటు దూరంలోనే మాల్‌ అయినా.. జాడ‌లేని ట్రాఫిక్ పోలీసులు వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర ఇబ్బందులు అధికారుల తీరుపై జ‌నం మండిపాటు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : హ‌న్మ‌కొండ‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఎదుట ఆదివారం ప్రారంభ‌మైన‌...

క‌స్తూర్బాలో కొట్లాట‌!

కొట్టుకుంటున్న విద్యార్థినులు స్పెష‌లాఫీస‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ క‌రువు ఉపాధ్యాయుల ఇష్టారాజ్యం ఉన్న‌తాధికారులకు స‌మాచారం ఇవ్వ‌ని వైనం ఏకప‌క్షంగా ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినికి టీసీ అధ్వానంగా బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి క‌స్త‌ర్బాగాంధీ గురుకుల బాలిక‌ల విద్యాలయం నిర్వ‌హ‌ణ‌ అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు : మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు మండ‌లం బ్రాహ్మ‌ణ‌ప‌ల్లిలోని క‌స్తూర్బా గాంధీ గురుకుల బాలికల విద్యాల‌యం నిర్వ‌హ‌ణ రోజురోజుకూ అధ్వానంగా...

గిరిజనుల ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆందోళన

పాఠశాలను సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ రికార్డులు, వంటగది, స్టోర్ రూమ్ పరిశీలన.. విద్యార్థులతో మాట్లాడి వివరాల సేకరణ.. అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు: గూడూరు గిరిజన ఆశ్ర‌మ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం పాఠశాల గేటు ముందు ఆందోళన చేపట్టారు. మెనూ పాటించడం లేదని, తాగునీటికి ఇబ్బంది ఉందని, వార్డెన్ నిర్లక్ష్య...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...