Friday, September 13, 2024

మెగాస్టార్‌కు ఊహించ‌ని షాక్‌..! చిరుకు ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడూలేదుగా..

Must Read

మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు రామ్ చరణ్‌ తొలిసారి పూర్తిస్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’.. కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల తర్వాత, భారీ అంచ‌నాల మ‌ధ్య ఏప్రిల్ 29వ తేదీన సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే సినిమా ఆశించనంత విజయం అందుకోలేదు. మొదటి నుంచే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా ప్లాప్ అయిందంటూ.. తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆచార్య డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి మరోలా ఉంది. మెగాస్టార్ చిరు సినిమా కదా అని.. ఆచార్యను భారీ మొత్తంతో కొన్నవారి పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది.

ఈ క్రమంలో ఓ డిస్ట్రిబ్యూటర్ చిరంజీవికి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కళ్యాణ కర్నాటక రీజియన్ రాయచూర్ జిల్లాకు చెందిన రాజగోపాల్ బజాజ్ అనే డిస్ట్రిబ్యూటర్ చిరుకు బహిరంగ లేఖ రాశాడు. తాను ఆచార్య సినిమాను కొనుగోలు చేశానని.. కాని అది ఆశించిన స్థాయిలో థియేటర్లలో ఆడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను తీవ్రంగా నష్టపోయానని చెప్పుకొచ్చాడు. వరంగల్‌ శ్రీనుకు చెందిన కార్తికేయ ఎగ్జిబిటర్స్‌కు భారీగా ప్రీమియం చెల్లించామన్నాడు. కానీ ఇప్పుడు ఆచార్య సినిమాకు అభిమానుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. సినిమా కూడా థియేటర్లలో సరిగా ఆడటం లేదు. దీంతో తాను భారీ నష్టాలు చవిచూస్తున్నామన్నాడు. అయితే ఈ లేఖను ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో షేర్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ పోస్టు వైరల్ అవుతోంది. మరి దీనిపై చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img