Friday, September 13, 2024

రేపు వ‌రంగ‌ల్‌ ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు

Must Read

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీ పరిధిలో అక్టోబ‌ర్ 27వ తేదీ శుక్ర‌వారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా భారీ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించిన‌ట్లు సీపీ అంబ‌ర్ కిశోర్ ఝా తెలిపారు. వరంగల్లోని బట్టుపల్లి, కడిపికొండ మార్గంలో ఎస్.ఆర్ స్కూల్ వద్ద తేదీ శుక్ర‌వారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఉన్నందున భారీ వాహనాలకు, ట్రక్కులు కడిపికొండ ఫ్లైఓవర్ మీదుగా అనుమతించబడవ‌ని తెలిపారు. హైదరాబాదు నుండి వరంగల్, ఖమ్మం వచ్చే భారీ వాహనాలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్దగల ఓఆర్ఆర్ మీదుగా, ఎనుమాముల మార్కెట్, తెలంగాణ జంక్షన్, ఫోర్ట్‌రోడ్డు మీదుగా ఖమ్మంకు వెళ్లాల్సి ఉంటుంద‌ని అన్నారు. అదేవిధంగా ఖమ్మం నుండి హైదరాబాద్‌ వెళ్లవలసిన భారీ వాహనాలు నాయుడు పంపు నుండి పోర్టురోడ్డు, తెలంగాణ జంక్షన్, ఎనుమాముల మార్కెట్ నుండి ఓఆర్ఆర్‌ మీదుగా హైదరాబాదుకు వెళ్లాల్సి ఉంటుంద‌ని తెలిపారు. మీటింగ్ జరిగే ప్రదేశంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ట్రైసిటీ పరిధిలో భారీ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా సీపీ వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా ఈనెల 27వ తేదీ మధ్యాహ్నం 12.00 నుండి సాయంత్రం 06.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని సీపీ తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img