- పార్టీ అభ్యర్థికి 50వేల మెజార్టీ అందిస్తాం..
- మాజీ ఎమ్మెల్యే మొలుగురి భిక్షపతి
- ఉమ్మడి గీసుకొండ మండల మహిళా సదస్సు
పాల్గొన్న విజయ్‌చందర్‌రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, సంతోష్‌కుమార్
అక్షరశక్తి, గీసుగొండ : పరకాల నియోజకవర్గం ఉమ్మడి గీసుకొండ మండల మహిళా సదస్సును ఊకళ్ళు ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో గురువారం ఉదయం బీజేపీ గీసుకొండ మండల అధ్యక్షుడు నిమ్మగడ్డ జాన్ విక్రమ్ అధ్యక్షతన నిర్వహించారు. 15వ డివిజన్ అధ్యక్షులు బిల్లా రమేష్, 16వ డివిజన్ అధ్యక్షులు గోదాసి అశ్విన్ కుమార్, 17వ డివిజన్ అధ్యక్షులు ఇదిగాని నవీన్ ఆధ్వర్యంలో ఈ మహిళా సదస్సుకు ఈ మూడు డివిజన్ల పరిధిలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, సిరంగి సంతోష్ కుమార్, బిజెపి నాయకులు డాక్టర్ కాళీప్రసాద్ రావు హాజరై మాట్లాడారు. పరకాల నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిని 50వేల మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపుతామని అన్నారు.
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలవకముందు ఉన్న ఆస్తులెన్ని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్ని ఆస్తులు సంపాదించారో ప్రజలకు తెలుసునని, కాంట్రాక్టర్ అవతారం ఎత్తారని విమర్శించారు. పరకాల నియోజకవర్గంలో బీజేపీకి గెలిచిన అనుభవం ఉందని అన్నారు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే కాంగ్రెస్ కు వేసినట్టేనని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్టేనని అన్నారు. పరకాలలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని, బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ జీకే రాంబాబు, పార్టీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు రాదారపు శివకుమార్, పరకాల కౌన్సిలర్ జయంత్‌లాల్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బండారి కళ్యాణి, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు గోదాసి చిన్న, పరకాల నియోజకవర్గ కన్వీనర్ ముల్క ప్రసాద్, కార్యాలయ కార్యదర్శి కంది క్రాంతి కుమార్, కోశాధికారి పగడాల రాజకుమార్, బిజెపి జిల్లా కార్యదర్శి మోలుగురి శ్రీనివాస్, రాష్ట్ర, జిల్లా, మండల, డివిజన్, మహిళా నాయకులు, పదాధికారులు , కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.