Monday, June 17, 2024

అధైర్యపడొద్దు అండగా ఉంటాం..

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : లేబర్ కాలనీకి చెందిన రిటైర్డ్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బస్కుల శ్రీనివాస్ కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని నరేంద‌ర్ అన్నారు. బస్కుల శ్రీనివాస్ ఓ ప్రైవేట్ చిట్ ఫండ్ లో చిట్టీ వేశారు. చిట్టీ డబ్బులు రావేమో అని ఆందోళనతో మనోవేదనకు గురై రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలియగానే ఈ రోజు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బస్కుల శ్రీనివాస్ నివాసానికి వెళ్లి మృతదేహం వద్ద పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ… సదరు చిట్ ఫండ్ యాజమానులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి చిట్టీకి సంబందించిన డబ్బులు వచ్చేలా కృషి చేస్తామన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే నరేందర్ హామీ ఇచ్చారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img