అక్షరశక్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం పోలెపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని దయాకర్‌రావు ప్రారంభించారు.
గ్రామపంచాయతీ భవనం, సీసీ రోడ్లు, డ్రైనేజీలకు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం గ్రామంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన మన ఊరు – మన బడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలెపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కరెంట్, మంచి నీరు, మైనర్ రిపేర్లు, అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన వెంట అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ ఎస్ నాయకులు తదితరులున్నారు.