Wednesday, June 19, 2024

రైతు సంఘాల ఆధ్వర్యంలో విద్రోహ దినం

Must Read

అక్షరశక్తి, వరంగల్ ప్రతినిధి: మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి పంటల మద్దతు ధర చట్టం రైతు అమరవీరులను ఆదుకుంటామని, రైతులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి రైతుల మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని, రైతు అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని, కేంద్ర విద్యుత్ చట్టాన్ని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే విషయాన్ని పరిశీలిస్తామని రాతపూర్వక హామీ ఇచ్చి నేటికీ అమలు చేయకుండా రైతాంగ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని ఏఐకెఎస్ సిసి జిల్లా కన్వీనర్, ఏఐకెఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పెద్దారపు రమేష్,కో కన్వీనర్లు సోమిడి శ్రీనివాస్ రాచర్ల బాలరాజు, ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి గోనె కుమారస్వామి న్యూడెమోక్రసీ, సిపిఎం, ఎస్ యు సి ఐ జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు,ముక్కెర రామస్వామి, ఎద్దుల సత్యనారాయణలు అన్నారు. రైతు ఉద్యమ హామీలను విస్మరిస్తే ఉపేక్షించేది లేదని ఉద్యమం పునరావృతం కాక తప్పదని హెచ్చరించారు.

ఈరోజు రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుమేరకు కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిరసనగా విద్రోహ దినం సందర్భంగా కళ్ళకు నల్ల గంతలు కట్టుకొని వ‌రంగ‌ల్ పోచ‌మ్మ‌మైదాన్ సెంట‌ర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ డిసెంబర్ 9 వ తేదీన ఇచ్చిన హామీలలో ఏ ఒక్క దానిని ఇప్పటి వరకు నెరవేర్చలేదని, ఈ కారణంగానే దేశవ్యాప్తంగా రైతులు జ‌న‌వ‌రి 31న‌ “నమ్మక ద్రోహ దినం” గా పాటిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం రాత పూర్వకంగా ఇచ్చిన హామీలను ఉల్లంఘిస్తే రైతులకు తమ ఉద్యమాన్ని మళ్ళీ దేశ వ్యాప్తంగా చేపట్టడమే అనివార్యం అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ డిఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, వివిధ ప్రజా సంఘాల నాయకులు అప్పన పూరి నరసయ్య ఐతం నాగేష్ బొల్లు ఎల్లయ్య మోకిడి పీరయ్య నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img