Friday, September 13, 2024

అమ్మో.. వీడు మామూలు దొంగ‌కాదు..

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధితో పాటు చుట్టు ప్రక్కల జిల్లాల్లో చోరీలకు పాల్పడితున్న అంతర్ జిల్లా దొంగతో పాటు చోరీ సొత్తును కొంటున్న మరో ఇద్దరు నిందితులను సిసిఎస్, కాజీపేట్ పోలీసులు సంయుక్తంగా కల‌సి శనివారం అరెస్టు చేశారు. వీరి నుండి పోలీసులు సూమారు 21లక్షల విలువైన‌ 394గ్రాముల బంగారు, 2కిలోల 280గ్రాముల వెండి అభరణాలతో పాటు, రెండు కార్లు, తొమ్మిది సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్ట‌ర్‌.తరుణ్ జోషి వివ‌రాలు వెల్ల‌డించారు. వి.యం బంజర, ఖమ్మం జిల్లాకు చెందినవాడు ప్రస్తుతం హైదరాబాద్ లోని జీడిమెట ప్రాంతంలో నివాసం వుంటున్న తూర్పాటి ప్రసాద్ అలియాస్ జగన్ రోజు వారికూలీగా పనిచేసేవాడు. వచ్చి డబ్బుతో నిందితుడు జల్సాలు చేయడంతో పాటు చేడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. కూలీ ద్వారా వచ్చే ఆదాయం తన జల్సాలకు సరిపోకపోవడంతో నిందితుడు 2012 సంవత్సరం నుండే చోరీలు చేయడం మొద‌లుపెట్టాడు.

వరంగల్ ఉమ్మడి జిల్లాలోపాటు ఖమ్మం జిల్లాలో మొత్తం ఎనిమిది చోరీలకు పాల్పడ్డాడు. చివరగా నిందితుడున్ని పోలీసులు 2020 సంవత్సరంలో అరెస్టు చేసిన జైలుకు తరలించారు. 2021 మార్చి మాసంలో జైలు నుండి విడుదలైన నిందితుడిలో ఎలాంటి మార్పురాలేదు. తన జల్సలకోసం అవసరమైన డబ్బు కోసం నిందితుడు మరో మారు చోరీ చేసేందుకు సిద్ధపడి వరంగల్ పోలీస్ కమిషనరేట్ తో పాటు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పగలు, రాత్రి సమయాల్లో తాళం వేసివున్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించాడు. ఇందులో కాజీపేట, ఇంతేజా గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడచొప్పున, నర్సంపేటలో రెండు, హనుమకొండ, కేయూసి, ముల్కనూరు, రఘునాథ ప‌ల్లి, జనగాం, యాదగిరిగుట్ట, సూర్యాపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున నిందితుడు మొత్తం 18 దొంగతనాలను పాల్పడ్డాడు. నిందితుడు చోరీ చేసిన బంగారు, వెండి అభరణాల్లో కొద్ది మొత్తంలో తన వద్ద భద్రపర్చుకోని మిగితావాటిని హైదరాబాద్ కు చెందిన జ్యోతుల జ్యోతి, వడ్డేబాలాజీలకు దొంగసొత్తును అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు.

ఈ చోరీలపై అప్రమత్తమైన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా రెడ్డి పర్యవేక్షణలో సిసిఎస్, కాజీపేట ఎసిపిల అధ్వర్యంలో సిసిఎస్, కాజీపేట్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దర్యాప్తులో పోలీసులు నిందితుడి కదలికపై నిఘా ఏర్పాటు చేసారు. ఈ రోజు ఉ దయం నిందితుడితో పాటు చోరీసొత్తు కోనుగోలుదారులు జ్యోతుల జ్యోతి, వడ్డే బాలాజీతో కల్సి చోరీ సోత్తును వరంగల్ బులియన్ మార్కెట్లో అమ్మేందుకుగాను కారులో బయలుదేరి వడ్డేపల్లి క్రాస్ వద్ద వున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో సిసిఎస్, కాజీపేట్ పోలీసులు సంయుక్తంగా కలిసి వెళ్ళి నిందితులను అదుపులోకి తీసుకోని వారివద్ద వున్న బ్యాగులను తనిఖీ చేయగా అందుబాటులో బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు. వారిని విచారించగా నిందితుడు పాల్పడిన చోరీలను పోలీసుల ఎదుట అంగీకరించాడు. నిందితుడితో పాటు చోరీ సొత్తును కోనుగోలు చేసే వ్యక్తులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి పుష్పారెడ్డితో పాటు సిసిఎస్, కాజీపేట ఏసిపిలు బాబురావు, శ్రీనివాస్, సిసిఎస్, కాజీపేట్ ఇన్ స్పెక్టర్లు శ్రీనివాసరావు, రమేష్ కుమార్, మహేందర్ రెడ్డి, సిసిఎస్ ఎస్.ఐ సంపత్ కుమార్, ఏఏఓ సల్మాన్ పాషా, ఎఎస్ఈ శ్రీనివాస్ రాజు, మహిళా ఎఎస్ఎ ఫర్వీన్, హెడ్ కానిస్టేబుళ్ళు రవికుమార్, జంపయ్య, కానిస్టేబుళ్ళు మహమ్మద్ ఆలీ, వేణుగోపాల్, నజీర్,నగేష్ తో పాటు కాజీపేట సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img