Tuesday, June 18, 2024

ఫ్లాష్‌.. ఫ్లాష్.. తోట పవన్‌పై దాడి కేసులో నలుగురు అరెస్ట్

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : యూత్ కాంగ్రెస్ నాయ‌కుడు తోట పవన్‌పై సోమ‌వారం రాత్రి దాడికి పాల్ప‌డిన నలుగురు నిందితుల‌ను హనుమకొండ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కు సంబంధిం చి హనుమకొండ ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాస్ జీ వివరాలను వెల్లడించారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గత రాత్రి హనుమకొండలో చేపట్టిన పాద‌యాత్ర ముగిసిన అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు కాంగ్రెస్ ఉపాధ్యక్షు డు తోట పవన్ పై దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. కాంగ్రెస్ నేత‌ల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న హనుమకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టి దాడికి పాల్పడిన నలుగురు నిందితులను గుర్తించారు. చెక్క సుమన్, రావులకొలను నరేందర్, గుడికందుల వినోద్ కుమార్, సిటిమోర్ సునార్ కృష్ణను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడి కేసులో సంబంధం వున్న మిగితా నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని హనుమకొండ ఇన్స్ స్పెక్టర్ వెల్లడించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img