Tuesday, June 18, 2024

భార్య‌ను చంపి భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, ఆత్మ‌కూరు: హ‌న్మ‌కొండ జిల్లా ఆత్మ‌కూరు మండ‌ల‌కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను అతికిరాతకంగా న‌రికి చంపిన భ‌ర్త‌.. పురుగుల మందుతాగి తానూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. వివ‌రాలిలా ఉన్నాయి. ఆత్మకూరు మండల క్రేందానికి చెందిన తాళ్ల హరీష్, పుష్ప‌లీల‌ కొన్ని నెల‌ల కింద‌ట ప్రేమించిపెళ్లి చేసుకున్నారు. అయితే.. కొద్దిరోజులకే ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్తాయి. ఈక్ర‌మంలో పెద్ద‌మ‌నుషుల స‌మ‌క్షంలోనూ పంచాయితీ చేసి, మ‌ళ్లీ ఇద్ద‌రిని ఒక్క‌టి చేశారు. అయితే.. భార్య‌పై అనుమానం పెంచుక‌న్న భ‌ర్త మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో గొడ్డలితో పుష్ప‌లీల‌ను నరికిచంపాడు. ఆ తర్వాత హరీష్ ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఆత్మకూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img