ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ప్రజలకే ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రజలు అభ్యర్థిని ఎంచుకోవడానికి ఓ ఫోన్ నంబర్‌ను 70748 70748 ప్రారంభించారు.
అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రజలు కాల్/ మెసేజ్ లేదా వాట్సాప్ చేయాలని అన్నారు. పంజాబ్‌లోని మూడు కోట్ల మంది ప్రజల నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని తాము అనుకుంటున్నామని, జనవరి 17 సాయంత్రం 5 గంటలలోపు ప్రజలు తమ ఎంపికను తెలియజేయాలని, ప్రజాభిప్రాయం మేరకు సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడం ఇదే మొదటిసారని కేజ్రీవాల్ అన్నారు.