Saturday, July 27, 2024

కేసీఆర్‌కు షాక్‌.. 11న జనగామ స్వచ్ఛంద బంద్

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, జ‌న‌గామ‌: రెండు రోజుల్లో జ‌న‌గామ జిల్లాకు మెడిక‌ల్ క‌ళాశాల‌ను ప్ర‌క‌టించ‌కుంటే.. ఈ నెల 11న జ‌న‌గామ జిల్లా స్వ‌చ్ఛంద బంద్‌కు పిలుపునిస్తున్న‌ట్లు జనగామ జిల్లా జేఏసీ పిలుపునిచ్చింది. జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో కన్వీనర్ మంగళంపల్లి రాజు అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించగా ముఖ్య అతిధులుగా డాక్ట‌ర్ రాజమౌళి, ఓయూ జేఏసీ నాయకురాలు బాల లక్ష్మి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. జనగామ నాయకుల అసమర్థత వల్ల జిల్లా వెనుకబడి పోతుందని, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ముందుండి “మెడికల్ కాలేజీ తేవాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో బీఎస్సీ, ఎమ్మార్పీఎస్‌, టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్‌, ఎంఎస్ఎఫ్‌, తెలంగాణ నవ సమాజ్ పార్టీ, యువ తెలంగాణ పార్టీలు, రచయితల సంఘం, వైఎస్సార్‌టీపీలు పాల్గొని సోమ‌వారం నుంచి 11వ తేదీ వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. సోమ‌వారం నుంచి విద్యార్థులతో మానవహారం, లక్ష సంతకాల సేకరణ, లక్ష కరపత్రాలు పంపిణీ చేయ‌నున్నారు. ఈ కార్యక్రమంలో చరిత్ర పరిశోధకులు రెడ్డి రత్నాకర్ రెడ్డి, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు వెంకట స్వామి, కో.ఆర్డినేటర్ నిర్మాల రత్నం, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నర్ర నవీన్, కిషన్, యువ తెలంగాణ సుభాష్, తెలంగాణ నవ సమాజ్ పార్టీ యాసరపు కరుణాకర్, నాయ‌కులు ఉపేందర్, కుమార్, చంద్రశేఖర్, సోమరపు ఉపేందర్, ప్రసాద్, రాగాళ్ల ఉపేందర్, శ్రీధ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img