Saturday, July 27, 2024

కేజీయఫ్‌ నటుడు జునేజా మృతి

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : శాండల్‌వుడ్‌ నటుడు మోహన్‌ జునేజా(54) శ‌నివారం మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జునేజా బెంగళూరులోని ఓ ప్ర‌యివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉద‌యం తుది శ్వాస విడిచారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జన్మించిన జునేజా హాస్యనటుడిగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు. చెల్లాట‌లో అత‌ను న‌టించిన పాత్ర ప్రేక్ష‌కుల మ‌దిలో ఎప్ప‌టికీ నిలిచిపోతుంది. సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌గా నిలిచిన కేజీయఫ్‌, కేజీయఫ్‌-2 చిత్రాల్లో కూడా నటించారు. మోహన్‌ జునేజా మృతి పట్ల శాండల్‌వుడ్‌ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img