నయనతార ఫ్యాన్స్ అంతా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ టైం రానే వచ్చింది. ఎట్టకేలకు తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నయనతార త్వరలోనే పెళ్లి కూతురు కాబోతోంది. ప్రియుడు విఘ్నేశ్ శివన్‌ను నయనతార పెళ్లి చేసుకోనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో జూన్ 9న వీరి వివాహం జరగనుంది. తిరుమలలో ఇటీవలే పర్యటించిన విఘ్నేశ్ నయన్.. శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ తిరుమలలో పెళ్లి వేదిక కోసం పరిశీలించారు. వీఐపీ బ్రేక్ దర్శన్ సమయంలో స్వామివారిని దర్శించుకున్న జంట.. అనంతరం పెళ్లి కోసం.. వేదికను పరిశీలించినట్లు తెలిసింది. దీంతో వీరిద్దరు పెళ్లికి సంబంధించిన వార్తలు బయటకు వచ్చాయి.
చంద్రముఖి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన నయనతర… వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. దర్శకుడు విగ్నేష్ శివన్-నయన తార ప్రస్తుతం లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. 5 సంవత్సరాలుగా… వీరు ప్రేమించుకుంటుండగా.. ఇదిగో పెళ్లి, అదిగో పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు వీరిద్దరి వివాహానికి ముహుర్తం ఫిక్స్ అయ్యింది. కరోనా కారణంగా తమ పెళ్లి వాయిదా పడుతుంది అంటూ చెప్పుకొచ్చిన నయన్, విఘ్నేష్ .. సీక్రేట్ గా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. అయితే నయన్ ఇప్పటికే రెండు సార్లు పెళ్లివరకు వెళ్లి వెనక్కి వచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నయనతార.. తమిళ్ హీరో శింభు మధ్య లవ్ ఎఫైర్ నడిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. ప్రభుదేవతో కూడా నయన్ రిలేషన్ షిప్ కొన్నాళ్లు నడిచింది. వీరిద్దరీ మధ్య కూడా మనస్పర్థలు రావడంతో విడిపోయారు. చివరకు విఘ్నేశ్‌తో ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడిన ఈ లేడీ సూపర్ స్టార్.. ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కుతోంది.