Friday, September 13, 2024

హనుమకొండ జిల్లా జాక్ ఆధ్వర్యంలో ఘ‌నంగా మేడే ..

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హనుమకొండ జిల్లా జాక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసందర్భంగా తెలంగాణతల్లి విగ్రహం, ఛత్రపతి శివాజీ మార్గ్, మర్కజీ జంక్షన్ వద్ద హనుమకొండ జిల్లా జేఏసీ కార్మిక నాయకుడు తాడిశెట్టి కుమారస్వామి, జూకంటి రవీందర్, నలుబొల అమరేందర్ ఎర్ర జెండాని ఎగురవేశారు.

అనంత‌రం హనుమకొండ జిల్లా జేఏసీ కన్వీనర్ క్రాంతి మాట్లాడుతూ.. చికాగో కార్మికుల‌ త్యాగ ఫ‌లితంగా 136 సంవత్సరాలుగా ప్రపంచ కార్మిక దినోత్సవం జ‌రుపుకుంటున్నామ‌న్నారు. ఎర్ర జెండా నుంచే ప్రపంచంలో అన్ని పార్టీల సిద్ధాంతాలు, రంగురంగుల జెండాలు వచ్చాయ‌న్నారు. మర్క్స్, లెనిన్, స్టాలిన్, అంబేద్క‌ర్ కార్మికుల హక్కుల కోసం పోరాడార‌ని గుర్తు చేశారు. కార్మిక అమరవీరులకు నివాళులు అర్పించారు. కార్యక్ర‌మంలో ఆటో యూనియన్ నాయకులు అన్వ‌ర్, ప్రసాద్, రవిబాబు, ప్రభాకర్, నబీ, ముక్తార్, డీవైఎఫ్ఐ నాయకులు మధురకవి సుధీర్, బుర్ర శ్యామ్ గౌడ్, నలుబొల సంజయ్, మహేష్, అక్షయ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img