Tuesday, June 25, 2024

మేడే వ‌ర్ధిల్లాలి

Must Read

కార్మికులకు ఎమ్మెల్యే న‌రేంద‌ర్ మేడే శుభాకాంక్షలు
అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డే సందర్భంగా వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ కార్మికలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం వ‌రంగ‌ల్ కూర‌గాయ‌ల మార్కెట్‌తోపాటు ప‌లుచోట్ల‌ కార్మికుల‌తో క‌లిసి జెండా ఎగుర‌వేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ… మేడే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని అన్నారు.

నిరుద్యోగులు, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని పేర్కొన్నారు. కార్మికుల‌కు అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. కార్య‌క్రమాల్లో కార్పొరేట‌ర్లు, టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img