అక్షరశక్తి, వరంగల్ : ములుగు జిల్లా మేడారంలో సమ్మక సారలమ్మ మహాజాతర బుధవారం ప్రారంభమైంది. జాతరకు లక్షలాదిమంది భక్తజనం తరలివస్తున్నారు. భక్తులను ఆకట్టుకునేందుకు మ్యూజియంలో గ్రామీణ నిర్మాణాలు జరిగాయి. మట్టి గోడలు, గడ్డితో కప్పబడిన గుడిసెల నిర్మాణాలు చేపట్టారు. జానపద సంస్కృతులు, పల్లె ప్రాంత నిర్మాణాలు, సమ్మక్క సారలమ్మల ప్రతిమలను అందంగా నిర్మించారు. గ్రామాల్లో కనిపించే విభిన్న నిర్మాణాలు పూర్తి ఎకో ఫ్రెండ్లీ గా కనిపిస్తాయి. ఇంటి ముందు ముగ్గులు, అలంకరణ జాతరకు వచ్చిన భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
Previous article
Next article
Latest News