అక్షరశక్తి డెస్క: స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం గ్రేటర్ వరంగల్. మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద ర్యాలీని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎం పి డాక్టర్ కడియం కావ్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారదా, కుడా చైర్మన్ ఇనగల వెంకట్రామ రెడ్డి, జిడబ్ల్యుఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే లతో కలిసి ర్యాలీని ప్రారంభించి భద్రకాళి దేవాలయం వరకు కొనసాగిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు.
అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిడబ్ల్యూ ఎంసీ కార్యాలయ ఆవరణలో మంత్రి, మేయర్, ఎంపీ, కుడా చైర్మన్, కలెక్టర్లు మొక్కలను నాటారు.