Wednesday, June 19, 2024

కాంగ్రెస్ పార్టీలోనే చేరుతా..

Must Read

ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటికి సోమవారం ఉదయం కాంగ్రెస్ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మల్లురవి, రాజ‌న‌ర్సింహ త‌దిత‌ర నేత‌లు వెళ్లారు. ఈ మేర‌కు ఆయ‌న‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతాన‌ని స్ప‌ష్టం చేశారు. ఢిల్లీకి వెళ్లి అగ్ర‌నేత‌ల స‌మ‌క్షంలో చేరుతాన‌ని ఆయ‌న తెలిపారు. అయితే.. ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. ఇందుకు ఈనెల 27న ముహూర్తం కుదిరిందని మైనంపల్లి అనుచ‌రవ‌ర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img