Wednesday, June 19, 2024

ద‌ళితుల‌కు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : ద‌ళితుల‌కు బీజేపీ ఏం చేసిందో చెప్పాల‌ని మాజీ ఉప ముఖ్య మంత్రి, ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి అన్నారు. హ‌న్మ‌కొండ‌లోని హ‌రిత హోట‌ల్‌లో వ‌రంగ‌ల్ ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్‌, మాజీ ఎంపీ సీతారాంనాయ‌క్‌ల‌తో క‌లిసి గురువారం హ‌రిత హోట‌ల్‌లో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సి 19 , ఎస్టీ 12 రిజ‌ర్వుడ్‌ నియోజకవర్గ పరిధిలో బీజేపీ కైవసం చెసుకునే విధంగా ప్రణాళికలు వేస్తుంద‌న్నారు.

బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేద‌ని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉండి అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నారని మండిప‌డ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను అము్మ‌తున్నార‌ని, రాజ్యాంగ హ‌క్కుల‌ను కాల‌రాస్తున్నార‌ని తెలిపారు. ఎస్సి ఎస్టీ వర్గాలకు రాజ్యాంగ కల్పించిన నియోజకవర్గాల‌ను పరోక్షంగా ఎత్తి వేసేందుకు ప్లాన్ చేస్తుంద‌న్నారు. ఆయా రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓట‌మి ఖాయ‌మ‌న్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ని 2023,2024లో దారుణంగా ఓడిపోతుందని తెలిపారు. కిషన్ రెడ్డి టూరిజం శాఖామంత్రి గా ఉన్నార‌ని మేడారం సమ్మక్క సారలమ్మ పండుగను జాతీయ పండుగగా ప్రకటించాల‌న్నారు. రాష్ట్ర విభజన తరువాత వరంగల్ గిరిజన, విశ్వవిద్యాలయం ఏర్పాటు కాలేదని

ఇతర రాష్ట్రాల లో ఏర్పాటు చేశారన్నారు. పోడు భూముల విషయంలో బండి సంజయ్ మాట్లాడ‌టం స‌రికాద‌న్నారు. అటవీశాఖ భూములు కేంద్ర ఆధీనంలో ఉంటాయ‌ని తెలిపారు. బండి సంజయ్ నీకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నార‌న్నారు. తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే విభజన హామీలను అమలు చేయాల‌ని డిమాండ్ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img