అక్షరశక్తి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందినగర్ సమీపంలో గురువారం ఉదయం 8గంటల ప్రాంతంలో మటన్ వ్యాపారి లక్‌పతి దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలంలో బండరాళ్లు, ఇనపరాడ్, కారం పొడి ఉన్నాయి. లక్‌పతి స్వగ్రామం నెల్లికుదురు మండలం శ్రీరాంగిరి పరిధిలోని సున్నపురాళ్ల తండా. కొంతకాలంలో మానుకోటలోని మిలిటరీ కాలనీలో నివాసం ఉంటూ ఆర్డర్లపై మటన్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలియగానే.. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.