అక్షర శక్తి, నర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 19 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నర్సంపేట నియోజకవర్గ ప్రజల రక్షణే తమ బాధ్యత అని అన్నారు.
రాజకీయాలతో సంబంధం లేకుండా, పైసా లంచం ఇవ్వకుండా నిరుపేదలైన ఎంతో మంది ఈ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరులో నర్సంపేట నియోజకవర్గం 3వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, రైతు సమన్వయ సమితి కన్వీనర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.